Wednesday, September 10, 2025

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నటి ఐశ్వర్యా రాయ్

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వర్యా రాయ్ బచన్ మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా తన ఫోటోలను, పేరును, ఏఐతో రూపొందించిన పోర్నోగ్రఫీ కంటెంట్లను ఉపయోగించకుండా నిలువరించాలని ఆమె న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. కాగా న్యాయమూర్తి తేజాస్ కరియా తాత్కాలిక ఉత్తర్వులు జారీచేస్తామని మౌఖికంగా తెలిపారు. అవాస్తవిక, ఇంటిమేట్ ఫోటోలను ఇంటర్నెట్‌లో సర్కూలేట్ చేస్తున్నారని ఐశ్వర్యా రాయ్ తరఫు న్యాయవాది సందీప్ సేథీ కోర్టుకు తెలిపారు. కాగా రాయ్ తరఫున అడ్వొకేట్లు ప్రవీణ్ ఆనంద్, ధ్రువ్ ఆనంద్ కూడా వకాల్తా చేశారు. కాగా హైకోర్టు తదుపరి విచారణను నవంబర్ 7కు వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News