- Advertisement -
జైపూర్ లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియంకు గురువారం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో భద్రతా ఏజెన్సీలు తనిఖీని చేపట్టాయి. పంజాబ్ కింగ్స్ జట్టుతో రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ పోటీలు ఈనెల 16న కానున్న సందర్భంగా ఈ బెదిరింపు వచ్చిందని రాజస్థాన్ స్పోర్ట్‌కౌన్సిల్ ప్రెసిడెంట్ నీరజ్ కె పవన్ చెప్పారు. “ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయినందుకు మీ స్టేడియంలో బాంబు పేలుడు చేస్తాం. మీకు వీలైతే ప్రతివారిని రక్షించుకొండి” అని ఈమెయిల్ హెచ్చరించింది. దీంతో వెంటనే స్టేడియం లోని టీమ్‌లను ఖాళీ చేయించారు. పోలీసులు, క్విక్ రెస్పాన్స్ టీమ్, బాంబ్ డిస్పోజల్ స్కాడ్ స్టేడియంకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులేవీ దొరకలేదు. ఆ ఈమెయిల్ పంపిన వ్యక్తి కోసం సైబర్ విభాగం పోలీసులు గాలిస్తున్నారు.
- Advertisement -