Saturday, August 2, 2025

విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్..

- Advertisement -
- Advertisement -

నాగ్‌పూర్: అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం జరిగినప్పటి నుంచి విమాన ప్రయాణాలంటే చాలా మంది భయపడుతున్నారు. విమానంలో ఎక్కడికైనా వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో నిర్వహకులు కూడా ప్రయాణికులకు ధైర్యం కలిగించేలా.. కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపడుతున్నారు. కానీ, ఏదో మూల తప్పిదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. కొచ్చి నుంచి ఢిల్లీ బయలుదేరిన ఇండిగో విమానానికి (Indigo Plane) బాంబు బెదిరింపు రావడంతో విమానాన్ని నాగ్‌పూర్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులను సురక్షితంగా తరలించిన తర్వాత.. విమానాన్ని తనిఖీ చేశారు. బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News