- Advertisement -
విజయవాడలో బాంబు బెదిరింపులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా విజయవాడ (Vijayawada) రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం సృష్టించింది. కాల్ వచ్చిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్‌తో స్టేషన్ మొత్తం తనిఖీలు నిర్వహించారు. అన్ని ఫ్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా గాలించగా.. ఎక్కడ అనుమానస్పద వస్తువులు కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు విజయవాడలోని (Vijayawada) బీసెంట్ రోడ్డులోని ఎల్‌ఐసి బిల్డింగ్‌లో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాల్ వచ్చింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్‌కి కాల్ చేసి ఈ విషయం చెప్పాడు. దీంతో పోలీసులు, బాంబు స్క్వాడ్ అక్కడి దుకాణాలను తనిఖీ చేశారు. అయితే ఈ రెండు సందర్భాల్లో కాల్ చేసింది ఒకరేనా, లేక వేర్వేరు వ్యక్తులా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -