- Advertisement -
చండీగఢ్: చండీగఢ్‌లోని పంజాబ్, హర్యానా హైకోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కోర్టులో బాంబు పెట్టినట్లు రిజిస్ట్రార్ కార్యాలయానికి గురువారం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన చండీగఢ్ పోలీసులు, క్విక్ రెస్పాన్స్ టీం(QRT), రెస్క్యూ టీంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ముందస్తు జాగ్రత్త తనిఖీలు చేపట్టారు. హైకోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించి బాంబు స్క్వాడ్ సాయంతో తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో అధికారులు ఊపరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు మెయిల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -