తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో (Kerala) మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపింది. సోమవారం ఉదయం కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం జిల్లా కోర్టు అధికారిక ఇ మెయిల్‌కు ఓ మెసేజ్ వచ్చింది. సిఎం పినరాయ్ విజయన్ అధికారిక నివాసంతో పాటు జిల్లా కోర్టులో బాంబు ఉందంటూ ఆ ఇ మెయిల్‌లో రాసి ఉంది. దీంతో వెంటనే బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్వ్కాడ్ జాగిలాలతో మోహరించింది. కోర్టు లోపల, చుట్టుపక్కల ప్రాంతాలు, సిఎం అధికారిక నివాసంలో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఎటువంటి బాంబు కానీ, అనుమానస్పద వస్తువులు కానీ దొరకలేదని పోలీసులు తెలిపారు. బెదిరింపు ఇ మెయిల్ పంపిన వ్యక్తిని కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే ఈ ఏడాదిలో ఇప్పటివరకూ కేరళ రాష్ట్రంలో (Kerala) 28 సార్లు బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సిఎం నివాసంతో పాటు రాజ్‌భవన్, ఎయిర్‌పోర్టు, కోర్టులలో బాంబులు పెట్టినట్లు మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు అధికారికంగా విడుదల చేసిన నోట్‌లో పేర్కొన్నారు.
Also Read : భారత్‌లో అతిపెద్ద రైలు సొరంగం