Monday, July 14, 2025

సిఎం నివాసానికి బెంబు బెదిరింపు ఇ-మెయిల్

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) నివాసానికి బాబు బెదిరింపు వచ్చింది. తంపనూరు పోలీస్‌స్టేషన్‌కు గుర్తు తెలియని వ్యక్తులు బాంబు బెదిరింపు ఇ-మెయిల్ పంపించారు. క్లిఫ్ హౌస్ వద్ద బాంబు పేలుళ్లు జరగబోతున్నాయంటూ పేర్కొన్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నివాసాన్ని డాగ్‌స్క్వాడ్, బాంబు స్వ్కాడ్‌లతో తనిఖీలు చేశామని పోలీసులు తెలిపారు. కానీ, ఎక్కడ అనుమానస్పదంగా కనిపించలేదన్నారు.

దీంతో వచ్చింది నకిలీ ఇ-మొయిల్ అని తేల్చేశామని స్పష్టం చేశారు. తనిఖీలు జరిపిన సమయంలో సిఎం (Pinarayi Vijayan) ఆయన కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కీలక సంస్థలను లక్ష్యంగా చేసుకొని ఇటీవల వచ్చి బాంబు బెదిరింపుల వ్యవహారంతో ఈ ఇ-మొయిల్‌కి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News