మన తెలంగాణ / హైదరాబాద్ : భాగ్యనగరం బోనమెత్తింది. బోనాల జాతరతో సందడిగా మారింది. హైదరాబాద్ మహా నగర వ్యాప్తంగా బోనాల పండుగ వైభవంగా సాగింది. అమ్మవారి ఆలయాలకు ఉదయం నుంచే భక్తులు బోనాలతో బారులు తీరారు. ఆదివారం సెలవు దినం కావడంతో నగరంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. లాల్‌దర్వాజా సింహవాహిని మహాకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
ఘనంగా లాల్‌దర్వాజా మహాకాళి బోనాలు
హైదరాబాద్ లోని లాల్‌దర్వాజా సింహవాహిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా జరిగింది. ఉదయం అమ్మవారికి కుమ్మరి బోనం సమర్పించారు. ఆలయం వద్ద నాలుగు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. బోనాలు తెచ్చేవారి కోసం ప్రత్యేక క్యూలైన్ అం దుబాటులో ఉంచారు. 1200 మంది పోలీసులు, 10 షీ టీమ్స్‌తో ఆలయం వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా 2 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. అమ్మవారిని మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టిటిడి ఛైర్మన్ బీఆర్‌నాయుడు దర్శించుకున్నారు. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత ఆలయానికి వచ్చారు.
మహాకాళి ఆలయాన్ని సందర్శించిన కిషన్‌రెడ్డి
బోనాల ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అంబర్‌పేటలోని మహాకాళి ఆలయంలో బోనాల జాతర ఆదివారం ప్రారంభమైంది. ఈ ఆలయాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేయర్ విజయలక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వారిని ఆలయ నిర్వాహకులు సన్మానించారు. అలాగే, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
మహంకాళేశ్వర దేవాలయంలో ఈటెల పూజలు
బోనాల సందర్భంగా మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆలంమండి శ్రీశ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యక పూజలు నిర్వహించారు. అలాగే ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయం, గౌలిపుర పటేల్ నగర్‌లోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో , శ్రీ మాతా నల్లపోచమ్మ, ముత్యాలమ్మ ఆలయాలతో పాటు సుల్తాన్‌షాహి శ్రీ జగదాంబ దేవి ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమంలో మురళి యాదవ్, చంద్రశేఖర్ యాదవ్ , మహిపాల్ రెడ్డి , సూరి, లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఉప్పుగూడలో పట్టు వస్త్రాలు సమర్పించిన గుత్తా
ఆషాడ మాస బోనాల సందర్భంగా హైదరాబాద్ పట్టణంలోని , ఉప్పుగూడ మహంకాళి అమ్మవారికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని , సంతోషంగా ఉండాలని, ఈ సంవత్సరం వర్షాలు సంవృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి , స్థానిక నేతలు, ఆలయ కమిటీ ఛైర్మన్ మధుసూదన్ గౌడ్ పాల్గొన్నారు.
మహాకాలేశ్వర ఆలయంలో బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత
ఆషాఢ మాస బోనాల వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని చార్మినార్ పరిధిలోని మీరా లం మండి శ్రీ మహాకాలేశ్వర ఆలయంలో బీ ఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి తెలంగాణ ప్రజ ల సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. అలాగే లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక బోనం సమర్పించారు. అలియబాద్ దర్బార్ మైసమ్మ దేవాలయంలో కూడా కవిత బంగారు బోనం సమర్పించి, అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఆషాఢ మాస బోనాల వేడుకలు జూన్ 26న గోల్కొండ కోటలోని శ్రీ జగదంబిక అమ్మవారి ఆలయంలో
బంగారు బోనంతో ప్రారంభమై జూలై 24న చివరగా లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి బోనాలతో ముగియనున్నాయి. కాగా శివారు ప్రాంతాల్లో మాత్ర శ్రావణమాసం వరకు ఈ బోనాల పండుగను జరుపుకుంటారు.బోనాల పండుగ సందర్భంగా నగరంలోని ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని ప్రముఖ సినీ నటి నిధి అగర్వా ల్ సందర్శించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్ర త్యేక పూజలు చేశా రు. జులై 24న ఆమె నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల ఉండటంతో అ మ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో నిధి హీరోయిన్‌గా నటిస్తోంది.