Sunday, July 27, 2025

దేశ, హిందూ విభజనకు రాహుల్, రేవంత్ కుట్ర: బూర నర్సయ్య

- Advertisement -
- Advertisement -

ఏఐసిసి అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇరువురూ కలిసి ఒకరు దేశ విభజనకు, మరొకరు హిందూ విభజనకు కుట్ర చేస్తున్నారని బిజెపి నాయకుడు, మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. రాహుల్ గాంధీ హిందూ వ్యతిరేకి అని, రేవంత్ రెడ్డి ఒబిసిలకు వ్యతిరేకంగా బిసి జపం చేస్తున్నారని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో దుయ్యబట్టారు. గతంలో యుపిఏ అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేయలేదని, బిసిలకు అన్యాయం చేశారని ఆయన విమర్శించారు. ఇప్పుడేమో ఆ తప్పంతా తనదేనని రాహుల్ చెప్పడం ఆశ్చర్యంగా ఉందని, దీనిని ప్రజలు విశ్వసించరని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కువ కాలం ఢిల్లీలోనే ఉంటున్నారని, ‘ఢిల్లీకి హవా, మోడీకా దవా బహుత్ అచ్చా లగ్తా హై’ అని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కన్వర్టెడ్ బిసి అని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

స్వాతంత్య్రం లభించిన తర్వాతే బిసి, ఎస్‌సి, ఎస్‌టిలు జీవోల ద్వారానే లీగల్‌గా గుర్తింపు పొందారని ఆయన తెలిపారు. వర్గీకరణ అనేది ప్రభుత్వం నిర్ణయించిందే తప్ప తల్లి గర్భం నుంచి వచ్చేప్పుడే కులంతో రారని ఆయన చెప్పారు. జవహర్‌లాల్ నెహ్రూ పూర్వీకులు భారత దేశానికి చెందిన వారు కాదని, పర్షియన్ దేశస్తులని ఆయన తెలిపారు. కాశ్మీర్ లోయ, ఘాట్ జమ్మూ-కాశ్మీర్ ఇలా మొత్తం దేశంలో నెహ్రూ అనే సర్ నేమ్ ఒక్క నెహ్రూ కుటుంబానికే ఉందన్నారు. ఈ పేరు ఖచ్చితంగా తన మూలాలను గుర్తు పెట్టుకోవడానికి మోతీలాల్ తండ్రి భారత దేశంలో స్థిరపడినప్పుడు పెట్టుకున్నదే నెహ్రూ పదం అని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ కుటుంబానికి గాంధీకి ఏమి సంబంధం అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించే ముందు వారి నేతల మూలాల గురించి తెలుసుకోవాలని మజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్ హితవు పలికారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News