హైదరాబాద్: భార్యకు గుండు గీసి వివస్త్రను చేసి అనంతరం ఆమెను భర్త చంపేశాడు. ఈ సంఘటన హైదరాబాద్లోని బోరబండ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సాయిబాబా నగర్లో ఓర్సు నర్సింహులు(36), ఓర్సు సోని(26) అనే దంపతులు నివసిస్తున్నారు. నర్సింహులు దొంగతనలను తన వృత్తిగా మార్చుకున్నాడు. అతడిపై వివిధ పోలీస్ స్టేషన్లలలో 16 కేసులు నమోదయ్యాయి.
బోరబండలోని నాగుల ఎల్లమ్మ ఆలయం హుండీ చోరీకి గురికావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సిసి కెమెరాలను పరిశీలించగా నర్సింహులు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మత్తులో ఉన్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. అతడి ఇంటికి గడియ పెట్టి ఉండగా బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని డోర్ ఓపెన్ చేసి చూడగా భార్య మృతదేహం కనిపించింది. మృతదేహానికి గుండుగీసి, వివస్త్రంగా ఉన్నట్టు గుర్తించారు. నర్సింహులు మద్యం మత్తులో భార్యపై దాడి చేసి అనంతరం గుండుగీసి, వివస్త్రను చేసి చంపేసినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.