- Advertisement -
మన తెలంగా/కీసరః పట్టపగలు వ్యవసాయ పొలాల వద్ద బోరు మోటార్లు, ఇతర పరికరాలు చోరి చేసేందుకు వచ్చిన వ్యక్తులను రైతులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కీసరదాయరలో రైతు నక్క రాములు వ్యవసాయ పొలంలో మంగళవారం గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు బోరు మోటార్లు, డోర్లు ఎత్తుకువెళుతుండగా పమీప రైతులు గమనించారు. వెంటనే అప్రమత్తమై వారిని అడ్డుకొని చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గతంలో సైతం దుండగులు వ్యవసాయ పొలాల వద్ద మోటార్లు, విద్యుత్ వైర్లు, ఇతర వ్యవసాయ సామాగ్రి ఎత్తుకెళ్లారని రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- Advertisement -