అమరావతి: ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ప్రైవేటు మనిషే అని వైసిపి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సంపద సృష్టి అంటే ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడమా? అని ప్రశ్నించారు. బొత్స మీడియాతో మాట్లాడుతూ.. పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ తెచ్చిన మహానుభావుడు దివంగత మాజీ ముఖ్య మంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని, యూరియా కోసం డిమాండ్ చేస్తే చంద్రబాబు బెదిరిస్తున్నారని మండిపడ్డారు.
బెదిరించడం కాదని యూరియా సమస్యను పరిష్కరించండని, స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వం నిర్వాకం వల్ల పోరాటం తప్పడం లేదని అన్నారు. ఈ నెల 12న రౌండ్ టేబుల్ సమావేశానికి టిడిపి నేతలు కూడా రావాలని బొత్స సూచించారు. రుషికొండ భవనాలను మెంటల్ హాస్పిటల్ చేయాలని అన్నారంటే.. అశోక్ గజపతిరాజు మానసిక పరిస్థితి ఏమిటో అర్థమవుతుందని చెప్పారు. అలాంటి వాళ్లను మెంటల్ హాస్పిటల్ లో పెట్టాలని, అశోక్ గజపతి రాజుకు అహంకారం పుట్టుకతోనే వచ్చిందని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
Also Read : చంద్రబాబుకు న్యాయస్థానాలంటే లెక్కలేదు: అంబటి