అమరావతి: స్టీల్ ప్లాంట్ పోరాటం కోసం కమిటీ ఏర్పాటు చేస్తామని వైసిపి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మొదటి నుంచి వైఎస్ఆర్ సిపి వ్యతిరేకమని అన్నారు. బొత్స మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడమే వైఎస్ఆర్ సిపి ధ్యేయం అని తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ పై కూటమి నేతల దొంగబుద్ధి బయటపడిందని చెప్పారు.
స్టీల్ ప్లాంట్ పై మొదటి నుంచి మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది ఒకే మాటని.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదనే చెప్పారని అన్నారు. ఎలాంటి పోరాటాలు చేయడానికైనా సిద్ధంగా ఉండాలన్నారని, అవసరమైతే తాను వచ్చి పోరాటంలో పాల్గొంటానని జగన్ చెప్పారని బొత్స పేర్కొన్నారు. విశాఖ వచ్చి స్టీల్ ప్లాంట్ కోసం డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు? అని స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు మోడీతో, చంద్రబాబు నాయుడు, పవన్ మాట్లాడలేదని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని వైఎస్ జగన్ ప్రధానిని కోరారని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
Also Read : మోత్కూర్ లో బావిలో దూకి వివాహిత ఆత్మహత్య?