Saturday, July 5, 2025

ఉదయం పెళ్లి… మధ్యాహ్నం ప్రియుడితో పారిపోయిన వధువు

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఉదయం పెళ్లి చేసుకొని మధ్యాహ్నం ప్రియుడితో వధువు పారిపోయింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం చెన్నైలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బర్మా కాలనీ చెందిన విజయ్ కుమార్ అనే యువకుడు, అంబేడ్కర్ నగర్‌కు చెందిన అర్చన అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఉదయం పెళ్లి చేసుకోగా సాయంత్రం రిసెప్షన్ ఉండడంతో బ్యూటీ పార్లర్‌కు వెళ్తున్నానని అర్చన తన కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లింది. ఆమె ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వస్తుంది. ఆమె కోసం వెతకగా ఎక్కడా కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా తన ప్రియుడితో కలిసి తిరువిగనగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. వరుడు విజయ్ కుమార్‌కు క్షమాపణ చెప్పి ప్రియుడితో వెళ్లిపోయింది. ఈ విషయం ముందే చెబితే పెళ్లి చేసుకునే వాళ్లం కాదు కదా? అని వరుడు బంధువులు గొడవకు దిగారు. వధువు కుటుంబ సభ్యులు పెళ్లికి అయ్యే ఖర్చులు ఇస్తామని చెప్పడంతో వరుడు బంధువులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపనందుకు విజయ్ సంతోషంగా ఉండాలని నెటిజన్లు కోరుతున్నారు. ఆమె ప్రియుడితో వెళ్లిపోవడమే బెటర్ అని కొందరు కామెంట్లు  చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News