బ్రిటన్ ప్రజాస్వామ్య వ్యవస్థలో భారీ సంస్కరణలకు సిద్ధమవుతోంది. బ్రిటీష్ ప్రభుత్వం వచ్చే సార్వత్రిక ఎన్నికల లోగా ఓటింగ్ వయస్సును 16 సంవత్సరాలకు తగ్గించాలని ఆలోచిస్తోంది. బ్రిటీష్ ప్రధాని కైర్ స్టార్మర్ ప్రభుత్వం ప్రతిపాదనను పార్లమెంటు ఆమోదించవలసి ఉంది. 16-17 ఏళ్ల వయస్సు ఉన్న నవ యువకులు ప్రజాస్వామ్యంలో మరింత కీలక పాత్ర వహించే అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఈ ఎన్నికల సంస్కరణలు తలపెడుతున్నారు. ఇప్పటికే ఈ వయస్సువారు సైన్యంలోనో, ఇతర సంస్థలలోనో పనిచేస్తున్నారు.
ఈ ప్రతిపాదన బ్రిటన్, స్కాట్లాండ్, వేల్స్ తో సహా దేశం అంతటా వర్తిస్తుంది. బ్రిటీష్ ప్రజాస్వామ్యంలో ఎక్కువ మంది, ముఖ్యంగా యువతరం పాల్గొనే అవకాశం కల్పించేందుకే తాము చర్యలు తీసుకుంటున్నట్లు బ్రిటీష్ ఉప ప్రధాని ఏంజెలా రేవర్ తెలిపారు.ఈ సంస్కరణలో భాగంగా ఆమోదయోగ్యమైన ఓటర్ గుర్తింపు కార్డు లభిస్తుంది.దీనివల్ల బ్రిటన్ లో జారీచేసే బ్యాంక్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ లు, వెటరన్ కార్డులు, ప్రస్తుత గుర్తింపు కార్డులను డిజిటల్ ఫార్మెట్ లో చేర్చడానికి వీలవుతుంది. దీనివల్ల ఎక్కువమంది ప్రజలు తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది.