Tuesday, July 29, 2025

పరువు హత్య..అక్కను చంపిన తమ్ముడు

- Advertisement -
- Advertisement -

పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి మందలించిన యువకుడు ఆ అమ్మాయికి తిరిగి ఫోన్ చేయడమే పాపమైంది. నలుగురిలో మన పరువు తీసినవాడు ఫోన్ ఎందుకు చేశాడని ఆగ్రహించిన తమ్ముడు అక్కను హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం… గ్రామానికి చెందిన దేశాల రాఘవేందర్ మేస్త్రీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే రాఘవేందర్ కుమార్తె రుచిత (21) అదే గ్రామానికి చెందిన ఈర్లపల్లి దినేష్ ప్రేమించింది.ఈ విషయమై పంచాయతీ పెట్టి ఇకపై అమ్మాయితో మాట్లాడవద్దని ఒప్పందం చేసుకున్నారు. అయితే రుచితకు దినేష్ ఫోన్ చేసి మాట్లాడుతుండగా గమనించిన ఆమె తమ్ముడు రోహిత్ మన పరువు తీసినవాడితో ఎందుకు మాట్లాడుతున్నావని ప్రశ్నించగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన తమ్ముడు అక్క రుచితను చంపి ఉంటాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News