- Advertisement -
తిమ్మక్ పల్లి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తిమ్మక్ పల్లిలో ఓ విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రామ్(13), లక్ష్మణ్( 13) అనే కవలలు సోమవారం చెరువులో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. సోమవారం నుంచి గజ ఈతగాళ్లతో రోజంతా గాలించగా ఇవాళ కనిపించారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సహాయంతో మంగళవారం మృతదేహాలు పోలీసులు వెలికితీశారు.
- Advertisement -