ఎన్‌డిఎ, ఇండియా
కూటమి అభ్యర్థులలో
ఎవరికి ఓటేసినా రాజకీయ
ఇబ్బందులు ఓటింగ్‌కు
దూరంగా ఉండడమే
ఉత్తమమని పార్టీ
అగ్రనాయకుల మనోగతం
మన తెలంగాణ/హైదరాబాద్: ఉప రా ష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉం డాల ని బిఆర్‌ఎస్ పార్టీ నిర్ణయించినట్లు స మాచారం. వచ్చే నెల 9న జరుగను న్న ఉపరాష్ట్రపతి ఎన్నకిలో ఎన్‌డిఎ అ భ్య ర్థికి గానీ, విపక్షాల అభ్యర్థికి గానీ ఓ టు వేయకుండా తటస్థంగా ఉండాలని పా ర్టీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలి సిం ది. ఈ విషయంపై అధికారిక ప్రక టన వెలువడాల్సి ఉంది. తెలంగాణ రా ష్ట్రా నికి సెప్టెంబర్ 9లోపు ఎవరు 2 లక్షల టన్నుల ఎరువులు తీసుకువస్తా రో ఆ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి బిఆర్ ఎస్ మద్దతు ఇస్తుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తేల్చి చెప్పారు. అ యితే ఇప్పటివరకు కెటిఆర్ డిమాండ్ పై కాంగ్రెస్ పార్టీ కానీ, బిజెపి పార్టీ స్పందించలేదు. ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ దన్‌ఖడ్ రాజీనామాతో ఇ ప్పు డు ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు జర గబోతున్నాయి. ఓటింగ్ విషయం లో బిఆర్‌ఎస్ వ్యూహం ఏంటి అనే విష యం ప్రస్తుతం చర్చనీయాంశంగా మా రింది. ఈ ఎన్నికలో పార్లమెంట్ ఉభ య సభల సభ్యులే ఓటర్లు. ప్రస్తుతం బిఆర్‌ఎస్ పార్టీకి వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్ రావు, పార్థ సార థి రెడ్డి, కె.ఆర్ సురేష్ రెడ్డి ఎంపీలు గా కొనసాగుతున్నారు.
వీళ్లు ఎవరికి ఓటే స్తారనేది ఆసక్తికరంగా మారింది. 20 22లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్‌డిఎ కూటమి తరఫున ద్రౌపది ము ర్ము, ఇండియా కూటమి తరఫున మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా పోటీ చే యగా, అప్పుడు తెలంగాణ సిఎంగా ఉన్న కెసిఆర్ ఇండియా కూటమి అభ్యర్థి యశ్వంత్ సి న్హాకు మద్దతు ప్రకటించారు ప్రస్తుతం ఉప రాష్ట్రపతి ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో బిఆర్‌ఎస్ ఎలాంటి వైఖరిని తీసుకోబో తున్నారన్నది చర్చనీయాంశంగా మారిం ది. బిజెపిలో బిఆర్‌ఎస్ పార్టీని విలీనం చే సేందుకు ప్రయత్నాలు జరిగాయనే ప్రచా రం ఇటీవల విస్తృతంగా జరిగింది. ఇలాం టి సమయంలో ఎన్‌డిఎ అభ్యర్థికి మద్దతు ఇస్తే బిజెపి, బిఆర్‌ఎస్ ఒక్కటే అనే అంటూ మరోసారి విలీన ప్రచారం తెర మీదికి వ చ్చే అవకాశం ఉంటుందని, ఒకవేళ విపక్షా ల అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి మద్దతు ఇ స్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సపోర్ట్ చేశా రన్న ప్రచారం జరుగుతుందని పార్టీ అధి ష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రాధాన్యతల కార ణంగా ఎవరికి మద్దతు ఇచ్చినా సమస్య తలెత్తిందని, కాబట్టి ఉపరాష్ట్ర ఎన్నికలో తటస్థంగా ఉండడమే ఉత్తమం అని నిర్ణ యానికి వచ్చినట్లు సమాచారం.