Thursday, July 3, 2025

బిసి నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి: కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత్ ప్రధాని నరేంద్రమోడీ వద్దకు సిఎం రేవంత్ రెడ్డి అఖిల పక్షాన్ని ఎందుకు తీసుకెళ్లలేదని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha) ప్రశ్నించారు. బిజెపిపై ఒత్తిడి తీసుకురావాలని ఖర్గేకు లేఖ రాస్తున్నామని, జూలై 8 లోపు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని డిల్లీకి తీసుకెళ్లాలని కవిత సూచించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..  బిసి రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వీలు లేదని విమర్శించారు. రిజర్వేషన్ల సాధన కోసం జులై 17న రైల్ రోకోకు పిలుపు ఇచ్చామని తెలియజేశారు. కాంగ్రెస్ లోని బిసి నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కవిత కోరారు.

బిసి రిజర్వేషన్ల (BC Reservations) కోసం బిఆర్ఎస్ సహకరిస్తోందని, తానే బిఆర్ఎస్ అని అన్నారు. రైల్ రోకోకు మద్దతు కోరుతూ బిఆర్ఎస్ సహా అన్ని పార్టీలకు లేఖ రాస్తామని చెప్పారు. గోదావరి- బనకచర్ల విషయంలో ప్రభుత్వం మెతక వైఖరి అవలంభిస్తోందని, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ను ఒక్క మాట కూడా అనలేడంలేదని పేర్కొన్నారు. చంద్రబాబు కోవర్టులు కాంగ్రెస్ లో ఉన్నారని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చెప్తున్నారని కవిత చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News