Saturday, July 19, 2025

తెలంగాణ తల్లి విగ్రహం కోసం.. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ శ్రేణుల ఫైట్

- Advertisement -
- Advertisement -

జనగామ: తెలంగాణ తల్లి విగ్రహం (Telangana Talli Statue) ఏర్పాటు విషయం కాంగ్రెస్, బిఆర్‌ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీసింది. జనగామ జిల్లా పాలకుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహం కొత్త నమూనను ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. అయితే పాత నమూననే ఉంచాలని బిఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు. దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకంది. కాంగ్రెస్-బిఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పాలకుర్తి పోలీసులు మోహరించి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేస్తుండగా.. పోలీసులు-బిఆర్‌ఎస్ నేతల మధ్య తోపులాట జరిగింది. బిఆర్‌ఎస్ వైఖరిని నిరసిస్థూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News