మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన బిఆర్ఎస్ (BRS leaders) నాయకుడు, రైతు బంధు సమితి మాజీ మండల అధ్యక్షుడు కొండ సోం మల్లు తండ్రి కొండ సోమయ్య, జి ఎస్ ఆర్ కన్స్ట్రక్షన్ నిర్వాహకులు గోరుపల్లి సంతోష్ రెడ్డి, గోరుపల్లి సతీష్ రెడ్డి ల తండ్రి, మాజీ జడ్పీటీసీ గోరుపల్లి శారద మామ గోరుపల్లి తిరుపతి రెడ్డి మృతి చెందారు. మృతుల కుటుంభ సభ్యులను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ లు మంగళవారం పరామర్శించారు. మృతుల చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు ఒంటెద్దు నర్సింహ్మ రెడ్డి, నేవూరి ధర్మేంధర్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ తీపిరెడ్డి మేఘారెడ్డి, మండల అధ్యక్షులు పొన్నెబోయిన రమేష్, కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు జంగ శ్రీను, గజ్జి మల్లేష్, నాయకులు పొన్నాల వెంకటేశ్వర్లు, చౌగోని సత్యం గౌడ్,మర్రి అనిల్ కుమార్, దాసరి తిరుమలేష్, పానుగుళ్ల విష్ణు మూర్తి,బయ్యని పిచ్చయ్య,మల్లం అనిత, మచ్చగిరి,బందెల శ్రీను,పురుగుల మల్లయ్య,వెంకన్న,ఎలుగు సోమయ్య, బండి వెంకటేష్,భాస్కర్,దాసరి నవీన్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: కీలక సన్నివేశాల కోసం భారీ సెట్