Thursday, July 17, 2025

ప్రజలు బిఆర్ఎస్ ను నమ్మే పరిస్థితి లేదు: రఘునందన్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్ఎస్ కు పోటీ చేయడానికి కనీసం అభ్యర్థులు లేరని బిజెపి ఎంపి రఘునందన్ రావు (Raghunandan Rao) చురకలంటించారు. బిఆర్ఎస్ గా మారిన టిఆర్ఎస్ కు ప్రజలు విఆర్ఎస్ ఇచ్చారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు (Telangana People ) బిజెపికి దగ్గరవుతున్నారని, బిఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. జనం గుండె చప్పుడుగా బిజెపి మారిందని పేర్కొన్నారు. తనపై వ్యక్తిగతంగా బురద జల్లేందుకు యత్నిస్తున్నారని,  దొంగే దొంగా దొంగా అని అరిచినట్లుందని బిఆర్ఎస్ తీరు అని విమర్శించారు. తెలంగాణలో బిఆర్ఎస్ ఎక్కడా లేదని, బిఆర్ఎస్ చెల్లని రూపాయని ఎద్దేవా చేశారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న పెయిడ్ బ్యాచ్ లపై కేసులు నమోదు చేయాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News