- Advertisement -
మన తెలంగాణ/మోత్కూర్: మోత్కూర్, అడ్డగూడూరు మండలాల బిఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం ఈనెల 30న నిర్వహిస్తున్నట్లు బిఆర్ ఎస్ మోత్కూర్ మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మోత్కూర్ మండలం లోని పాటిమట్ల ఎక్స్ రోడ్ లోని శ్రీ లక్ష్మీ నర్సింహా స్వామి ఫంక్షన్ హాల్ లో మోత్కూర్, అడ్డగూడూరు మండలాల బిఆర్ ఎస్ నాయకుల సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశానికి ముఖ్య అతిధులుగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ లు హాజరవుతారని తెలిపారు. బిఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.
- Advertisement -