Wednesday, July 16, 2025

జనం స్పందన లేకే.. బూతులు: సిఎం రేవంత్ పై జగదీష్‌రెడ్డి ఫైర్

- Advertisement -
- Advertisement -

లేని గొప్పలు చెప్పుకోవడం సిఎం రేవంత్‌రెడ్డికి అలవాటే
అసత్యాలతో సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారన్నారు
నేను రేవంత్ రెడ్డి స్థాయికి దిగజారను
తుంగతుర్తి సభలో సిఎం ఎంత మొత్తుకున్నా
జనం నుంచి స్పందన లేకపోవడంతో బూతులకు తెగ బడ్డారు
మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జగదీష్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేని గొప్పలు చెప్పుకోవడం ఆయనకు అలవాటేనని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జగదీష్‌రెడ్డి విమర్శించారు. నానాటికీ ఆయన తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కెసిఆర్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. 2021 జులైలో ప్రతి పక్షనేతగా భట్టి విక్రమార్క తన నియోజకవర్గంలో రేషన్ కార్డులు పంచినట్టు అప్పట్లో ట్వీట్ చేశారని, ఇప్పటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిఆర్‌ఎస్‌లో ఉన్నపుడు రేషన్ కార్డుల పంపిణీ గురించి ప్రత్రికల్లో ప్రకటనలు ఇచ్చారని గుర్తు చేశారు. చౌటుప్పల్‌లో అప్పటి ఎంఎల్‌ఎ రాజగోపాల్ రెడ్డి సమక్షంలో తాను రేషన్ కార్డులు పంచానని చెప్పుకున్నారని పేర్కొన్నారు.

కెసిఆర్ హయాంలో 6.47 లక్షల రేషన్ కార్డులను ఇచ్చామని, తన వాదనను తప్పని నిరూపిస్తే చెంప దెబ్బ కొట్టించుకోవడానికి సిద్ధం అని చెప్పారు. మరి తమ హయంలో రేషన్ కార్డులు పంపిణీ జరగలేదని అంటున్న కాంగ్రెస్ నేతలు చెంప దెబ్బలు తినడానికి సిద్ధమా..? అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం బిఆర్‌ఎస్ నేతలు లింగయ్య యాదవ్, గొంగిడి సునీత, ఎన్.భాస్కర్ రావు,రవీంద్ర కుమార్,కె .ప్రభాకర్ రెడ్డి, ఒంటెద్దు నరసింహ రెడ్డిలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ, సిఎం రేవంత్ రెడ్డి అసత్యాలతో సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారన్నారని విమర్శించారు. తాను రేవంత్ రెడ్డి స్థాయికి దిగజారను పేర్కొన్నారు. రేషన్ కార్డుల పంపిణీ పేరు మీద తుంగతుర్తిలో ప్రభుత్వ ఖర్చుతో సభకు జనాలను తీసుకొచ్చారని చెప్పారు. సిఎం ఎంత మొత్తుకున్నా సభలో జనం నుంచి స్పందన లేకపోవడంతో బూతులు తిడితేనైనా స్పందిస్తారని సిఎం బూతులకు తెగ బడ్డారని ఆరోపించారు.

హామీల పేరుతో సిఎం ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. నల్లగొండ జిల్లాలో రేవంత్ రెడ్డి రైతాంగాన్ని ఆగమాగం చేశారని, రెండు పంటలను ఎండబెట్టి నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడారన్నారని ధ్వజమెత్తారు. ధాన్యం ఉత్పత్తిలో నల్లగొండ జిల్లాను దేశంలోనే నంబర్ వన్‌గా బిఆర్‌ఎస్ ప్రభుత్వం తీర్చిదిద్దిందని, ధాన్యం ఉత్పత్తిలో 3 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 40 లక్షల మెట్రిక్ టన్నుల పెంచిందని చెప్పారు. నల్గొండలో యాదాద్రి పవర్ ప్లాంట్, 3 మెడికల్ కాలేజీలు, యాద్రాది టెంపుల్ అభివృద్ధి కెసిఆర్ హయాంలోనే జరిగాయని తెలిపారు. రేవంత్ హయాంలో ఒక్క ప్రాజెక్ట్ అయినా ప్రారంభించారా..? అని ప్రశ్నించారు. నల్లగొండ రైతులనే అడుగుదాం.. వారి చెంప దెబ్బలకు తాను సిద్ధం అని, మరి సిఎం రేవంత్, మంత్రులు అందుకు సిద్ధమేనా…? అంటూ సవాల్ విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News