Saturday, July 26, 2025

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జూబ్లీహిల్స్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూశారు. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుదిశ్వాస విడిచారు.రెండు రోజుల క్రితం గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న మాగంటి గోపినాథ్ ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఏఐజి ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసియులో ఉంచి డాక్టర్లు చికిత్స అందించారు. అప్పటి నుంచి అబ్సర్వేషన్ లో ఉంచారు. ఈ తెల్లవారుజామున ఆయన చనిపోయినట్లు  డాక్టర్స్ వెల్లడించారు. దీంతో బిఆర్ఎస్ నేతలు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ.. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. కాగా, ఆయన 2014లో టడిపి నుంచి ఎమ్మెల్యే గెలిచిన ఆయన.. తర్వాత బిఆర్ఎస్ లో చేరి 2018, 2023 ఎమ్మెల్యేగా గెలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News