Sunday, August 31, 2025

బిఆర్ఎస్ ను బిజెపిలో కలపాలని చూస్తున్నారు.. కవిత సంచలన కామెంట్స్

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ చేశారు. బిఆర్ఎస్ ను బిజెపిలో కలపాలని చూస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ ను గంపగుత్తగా బిజెపికి అప్పగించాలన్న ప్రయత్నం జరిగిందని ఆమె చెప్పారు. తాను జైలులో ఉన్నప్పుడే ఆ ప్రతిపాదన వచ్చిందని.. దానిని తాను వ్యతిరేకించానని తెలిపారు. బిఆర్ఎస్ స్వతంత్రంగా ఉండాలనేదే తన అభిమతమన్నారు. 101 శాతం బిజెపిలో కలిపే ప్రయత్నం చేస్తున్నారని.. తాను ఉంటే బిఆర్ఎస్ ను బిజెపిలో కలపడం కుదరదని.. కొంతమంది తనను కెసిఆర్ కు దూరం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎంపిగా పోటీ చేస్తే సొంత పార్టీ వారే తనను ఓడించారని ఆరోపించారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతున్న పార్టీ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమని కవిత స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News