హైదరాబాద్: కెసిఆర్‌కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ పూర్తి అంతర్గత విషయం అని.. దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ (BRS Party) ఓ మునిగిపోతున్న నావ అని అన్న ఆయన.. అలాంటి పార్టీలో ఇలాంటి ఘటనలు జరగడం మామూలే అని పేర్కొన్నారు. డాడీ-డాటర్ ఉత్తరం ఓ డ్రామా అని ఎద్దేవా చేశారు. కవిత ఎందుకు ఉత్తరం రాశారు తనకు తెలియదని.. కానీ, కెసిఆర్, కవితల మధ్య మాటలు లేవని ఉత్తరం ద్వారా తెలిసిందని పేర్కొన్నారు. కుటుంబ పార్టీలు దేశానికి ప్రమాదకరమని అన్నారు.
కెసిఆర్ సొంతపార్టీ ఎమ్మెల్యేలనే దగ్గరకు రానీవ్వరు అని కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. 14 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న తనకే అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. కేంద్రమంత్రి అయ్యాక కూడా కెసిఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని మండిపడ్డారు. పార్టీ కేడర్‌ను కెసిఆర్ కలవట్లేదని స్వయంగా కవిత తనతో చెప్పిందని. బిఆర్‌ఎస్ పార్టీ (BRS Party) డాడీ, డాటర్, సన్, సన్-ఇన్ లా.. పార్టీ అని విమర్శించారు.