Wednesday, September 17, 2025

జూబ్లీహిల్స్‌లో బిఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. గత 22 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. హైదరాబాద్‌ను తెలంగాణ ఆర్థిక ఇంజిన్‌గా మార్చిన గత పదేళ్ల తమ ప్రభుత్వ పాలనకు భిన్నంగా, కాంగ్రెస్ పార్టీ విధానాలు నగరాన్ని పూర్తిగా కుప్పకూల్చేలా ఉన్నాయని, ఈ విషయాన్ని నగర ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి కొనసాగాలంటే భారత రాష్ట్ర సమితి మళ్లీ అధికారంలోకి రావాల్సిందేనని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికపై మంగళవారం కెటిఆర్ అధ్యక్షతన బిఆర్‌ఎస్ పార్టీ

సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సృష్టించిన భయం కారణంగా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ఆరోపించారు. అన్ని రంగాలపై కాంగ్రెస్ అసమర్థ విధానాల ప్రతికూల ప్రభావం తీవ్రంగా ఉందని గుర్తు చేశారు. సమాజంలోని అన్ని వర్గాలు కాంగ్రెస్ అసమర్థ విధానాల వల్ల నష్టపోయాయని ఆరోపించారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ సీనియర్ నేతలు కెటిఆర్‌తో చర్చించారు. ఈ ఉప ఎన్నికలో పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేసి, జూబ్లీహిల్స్ నుంచి భారత రాష్ట్ర సమితి విజయయాత్రను తిరిగి ప్రారంభించాలని కెటిఆర్ పిలుపునిచ్చారు.

Also Read: త్వరలో మహిళా పాలసీ ప్రకటిస్తాం : మంత్రులు సీతక్క, సురేఖ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News