Thursday, July 24, 2025

విద్యార్థుల హక్కుల కోసం బిఆర్‌ఎస్ పోరాడుతుంది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

విద్యార్థుల హక్కుల కోసం బిఆర్‌ఎస్ పోరాడుతుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ భరోసా ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు అద్భుతమైన పాత్ర పోషించారని గుర్తు చేశారు. భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ నివాసంలో విద్యార్థి విభాగం నాయకులను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ సంక్షోభానికి చేరిన పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై విద్యార్థులు పోరాటం చేస్తే, వారిపై అక్రమ కేసులు బనాయించడం దారుణమని అన్నారు. ప్రశ్నించే గొంతుకలను అణిచివేసేందుకు కాంగ్రెస్ చేస్తున్న పోలీస్ రాజకీయం చెల్లదని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుతున్నదని అన్నారు. విద్యావ్యవస్థను పూర్తిగా బ్రష్టుపట్టించిన రాష్ట్ర ప్రభుత్వం, దాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థులపై అడ్డగోలుగా కేసులు నమోదు చేస్తోందని ఆరోపించారు.

సోషల్ మీడియాలో నల్లబాలుకు రీట్వీట్ చేసినా కేసు, మీడియా సంస్థల ముందు శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్లినా అక్రమ కేసులు పెడుతున్నారని వాపోయారు. అంతేకాకుండా గెల్లు శ్రీనివాస్ భార్య గెల్లు శ్వేత ఇంటిలో ఉన్నప్పటికీ కేసు పెట్టి పోలీస్ స్టేషన్‌కు పిలవడం రాష్ట్రంలో నెలకొన్న రాచక పరిస్థితులకు నిదర్శనమని విమర్శించారు. రెవంత్ రెడ్డి పాలనలో పోలీసులు బడుగు, బలహీన వర్గాలపై కేసులు మోపుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు. రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణలో కొనసాగుతున్న అణిచివేత పరిపాలనపై ఎందుకు నోరు మెదపడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ సమావేశంలో వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చిన విద్యార్థులతో కేటీఆర్ ముచ్చటించారు. విద్యార్థి విభాగం నేతలు మాట్లాడుతూ కేటీఆర్ స్వయంగా వచ్చి మాతో కలిసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన నాయకత్వంలో బిఆర్‌ఎస్‌వి మరిన్ని విద్యార్థి ఉద్యమాలను చేపడుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News