Tuesday, September 9, 2025

పరిమిత ఎడిషన్ గోల్డీ-కిట్ ను ప్రకటించిన BSA గోల్డ్ స్టార్

- Advertisement -
- Advertisement -

ముంబయి: BSA గోల్డ్ స్టార్ భారతదేశానికి గత ఏడాది మళ్లీ వచ్చింది, తనతో పాటు ప్రామాణికమైన బ్రిటీషు మోటార్ సైక్లింగ్ యొక్క సౌందర్యాన్ని తెచ్చింది. ఇది మెరుగుదలలో కొత్త ప్రమాణాన్ని కూడా నెలకొల్పింది దీని ద్వారా ఇప్పుడు పెద్ద సింగిల్-సిలిండర్లను కూడా కొలుస్తారు. ఒక సంవత్సరం తరువాత, ఈ ఉత్తమమైన సింగిల్ పండగ సీజన్ సమయంలో అర్హత కలిగిన ఔత్సాహికుల కోసం BSA వారి మొట్ట మొదటి ఎక్స్ ఛేంజ్ కార్యక్రమంతో సంబరం చేసుకుంటోంది.

650 సిసి గోల్డ్ స్టార్ తన డిజైన్ స్వచ్ఛత మరియు పనితనం కోసం ప్రత్యేకంగా నిలిచింది. తమ వార్షికోత్సవం కోసం, రైడర్స్ ఏదైనా టూ-వీలర్ లో రూ. 10,000 విలువ వరకు వాణిజ్యం చేయవచ్చు. ప్రతి కొనుగోలుతో ఎంపిక చేయబడిన యాక్ససరీస్ యొక్క పరిమిత-ఎడిషన్ సెట్ తో వచ్చింది: గాలిని కోయడానికి పొడుగు విండ్ షీల్డ్, సౌకర్యం కోసం పిలియన్ బ్యాక్ రెస్ట్, పాలిష్ చేయబడిన ఎగ్జ్ హాస్ట్ గార్డ్, మరియు లక్ష్యం మరియు స్టైల్ రెండిటిని చేర్చే రియర్ రైల్.

శరద్ అగర్వాల్, ఛీఫ్ బిజినెస్ ఆఫీసర్, క్లాసిక్ దిగ్గజాలు ఇలా అన్నారు, “ భారతదేశంలో ఇది ప్రారంభమైన నాటి నుండి, BSA గోల్డ్ స్టార్ విధేయతతో కూడిన ఫాలోయింగ్ ను పొందింది. క్లాసిక్ అయినా సమకాలీనమైనదిగా భావించే BSA వారి స్ఫూర్తి రూపాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఇక్కడ ఏడాది గడిచిన సందర్భం మాకు గర్వం కలిగిస్తోంది మరియు ఈ కార్యక్రమం అనేది రైడర్స్ ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు తెలియచేయడానికి మరియు BSA కుటుంబానికి మరింతమంది ఔత్సాహికులను ఆహ్వానించడానికి ఒక మార్గం.”

ఎక్స్ ఛేంజ్ కార్యక్రమం ఆగస్ట్ 23 నుండి సెప్టెంబర్ 23, 205 వరకు జరుగుతుంది. రూ. 5,896 విలువ గల కూర్చిన యాక్ససరీ కిట్ తో కలిపి, మొత్తం ప్రయోజనాలు రూ. 15, 896 విలువ గలవి, 1861 నుండి ప్రపంచ మోటారుసైక్లింగ్ లో భాగంగా ఉన్న BSA వారి ప్రసిద్ధి చెందిన వారసత్వానికి అనుగుణంగా తీసుకున్న వార్షికోత్సవం బహుమానం ఇది. క్లాసిక్ దిగ్గజాలు, BSA మోటార్ సైకిల్స్ తయారీదారు, GST సంస్కరణలు తరువాత BSA గోల్డ్ స్టార్ కోసం సవరించిన ధరల్ని ప్రకటించింది. సెప్టెంబర్ 21కి ముందు గోల్డీని కొనుగోలు చేసిన రైడర్స్ ఎక్స్-ఢిల్లీ షోరూం ధరపై రూ. 23,702 వరకు ఆదా చేయవచ్చు.

BSA డిజైన్, వారసత్వం

గోల్డ్ స్టార్ BSA వారి గొప్ప బ్రిటిషు DNAని ముందుకు తీసుకువెళ్తుంది. దిగ్గజపు బ్యాడ్జీతో రౌండెడ్ ఫ్యూయల్ ట్యాంక్, పాలిష్ చేయబడిన మెటల్ టచెస్, పిన్ స్ట్రిపింగ్, మరియు క్రోమ్ పైప్స్ కావలసిన సందర్భానికి అనుగుణంగా తయారు చేయబడ్డాయి. LED లైటింగ్, వైర్-స్పోక్ వీల్స్ మరియు క్రిస్ప్ స్విచ్ గేర్ వంటి ఆధునిక వివరాలు తమ క్లాసిక్ కేఫ్ రేసర్ సిల్హౌటీలో సహజంగా అమరాయి. తీర్చిదిద్దబడిన లైన్స్ , పొడవైన భంగిమ, లోతైన ఆకృతి గల సీటుతో దీని రూపం వలే శాశ్వతమైన భావన కలిగిస్తాయి.

సామర్థ్యం & ఇంజనీరింగ్

దీని ప్రధానమైన విషయంలో 45hp మరియు 55nm టార్క్ ని అందచేసే 652 సిసి, లిక్విడ్-కూల్డ్ , సింగిల్ సిలిండర్- DOHC ఇంజన్ భాగంగా ఉన్నాయి. ఇది తన శ్రేణిలో అత్యంత శక్తివంతమైన మరియు అత్యంత మెరుగుపరచబడిన వాటిలో ఒకటి. ఇది నగర ట్రాఫిక్ లో అయినా లేదా బహిరంగ జాతీయ రహదారుల పైన సాఫీ పవర్ కోసం తయారు చేయబడింది. 5-స్పీడ్ గేర్ బాక్స్ , అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్, డ్యూయల్-ఛానల్ ABS, మరియు టెలీఫోనిక్ ఫోర్క్స్ తో డబల్-క్రేడిల్ ఛాసిస్ లు సులభంగా రైడింగ్ చేయడానికి, ఆత్మవిశ్వాసం కోసం తయారు చేయబడ్డాయి. వెడల్పు టైర్లు, ప్రీమియం డిస్క్ బ్రేక్స్, మరియు ఉత్తమంగా సమతుల్యం చేయబడిన సస్పెన్షన్ లు ప్యాకేజీని పూర్తి చేస్తాయి, స్థిరత్వం, నియంత్రణ మరియు దూర ప్రాంతాల రవాణా సౌకర్యం అందిస్తాయి.

రంగులు, వేరియెంట్లు

గోల్డ్ స్టార్ అయిదు ఫినిష్ లలో వస్తోంది, ప్రతిది విలక్షణమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటుంది:

షాడో బ్లాక్- డాబుగా లేని, క్లాసిక్
ఇన్ సిగ్నియా రెడ్- రేసింగ్ హెరిటేజ్ పిన్ స్ట్రైప్స్ తో బోల్డ్
మిడ్ నైట్ బ్లాక్- నాజూకైనది, ఆదేశిస్తున్న
డాన్ సిల్వర్- ప్రీమియం వివరాలతో సొగసైనది
హైల్యాండ్ గ్రీన్- లోతైన, సుసంపన్నమైన, ఆధునికమైనది
ప్రతి వేరియెంట్ క్రోమ్ యాక్సెంట్లు, ఖచ్చితమైన వివరాలతో, బ్రాండ్ వారసత్వాన్ని గౌరవించే ఫినిష్ లతో నిర్వచించబడింది.

ఈ పండగ సీజన్ లో, గోల్డ్ స్టార కథలోకి అడుగు పెట్టండి, వారసత్వంపై నిర్మించబిడన మోటార్ సైకిల్, అందరి కంటే భిన్నంగా కనిపించడానికి నేటి కోసం రూపొందించబడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News