Thursday, July 10, 2025

యూపీలో అన్ని సీట్లలోనూ పోటీ చేయనున్న బిఎస్పీ: మాయావతి

- Advertisement -
- Advertisement -

లక్నో: 2024లో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలకు తమ బహుజన్ సమాజ్ పార్టీ మొత్తం 80 స్థానాలకు పోటీపడనున్నదని ఆ పార్టీ నేత మాయావతి గురువారం తెలిపారు. తమ పార్టీ ఏ ఇతర పార్టీతో పొత్తు పెట్టుకోకుండానే స్వంతంగా పోటీ చేయబోతున్నదన్నారు.

‘ఓట్ హమారా, రాజ్ తుమ్‌హారా నహీ చలేగా’ నినాదంతో ఎన్నికలకు ఉధృతంగా విజృంభించాలని ఆమె పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికలను బిజెపి నిర్వహించి, అవకతవకలకు గురిచేస్తోందని, ప్రజలు వారి తీరును చూశారని, బిఎస్పీ తిరిగి అధికారంలోకి వచ్చేలా చూస్తారని ఆమె అన్నారు. ఇతర రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థలు నిధులు సమకూరుస్తున్నాయని, కానీ తమ పార్టీ కేవలం కార్యకర్తలపైనే ఆధారపడి ఉందని బిఎస్పీ నేత మాయావతి అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News