Wednesday, August 20, 2025

పార్టీల పరంగా 42శాతం ఇద్దాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను చట్టపరంగా సాధించుకోలేని పక్షంలో అన్ని పార్టీలూ నైతికంగా స్వయంగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు స్వచ్ఛదంగా ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉప రాష్ట్రపతి పదవికి ఇండియా కూటమి అభ్యర్థి గా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భం గా బిసి రిజర్వేషన్ల బిల్లు, ఆర్డినెన్స్ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండడం, సెప్టెంబర్ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని హైకో ర్టు ఆదేశించడం తదితర అంశాలను మీడియా ప్రస్తావించగా,రిజర్వేషన్ల విషయంలో తాము ప ట్టుదలగా ఉన్నామని తెలిపారు.

రిజర్వేషన్ల బిల్లుల పై సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నామ ని అన్నారు. రిజర్వేషన్ల బిల్లు, ఆర్డినెన్స్ గురించి వి వరించారు. బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉ న్నాయని, సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశానుసారం రాష్ట్రపతి 90 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని అన్నారు. రిజర్వేషన్లు సాధ్యం కాని పక్షంలో ఎలా? అని ప్రశ్నించగా, ఈ నెల 23న గాంధీ భవన్‌లో తమ పార్టీ రాజకీయ వ్యవహారాల సలహా సంఘం (పిఏసి) సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అన్నీ మీ వద్దే చెప్పేస్తే ఇక పిఏసి ఎందుకని సీఎం రేవంత్‌రెడ్డి దాట వే శారు. తమ పార్టీ తరఫున రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేస్తామని అన్నారు. మిగతా పార్టీలూ రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన తెలిపారు. అ యితే చట్టపరంగా రిజర్వేషన్లు లేకుండా పార్టీలే ఇ చ్చుకుంటే ఒక సమస్య ఉంటుందన్నారు. ఒక స్థా నంలో ఒకరు బిసిని నిలబెడితే, అక్కడ ఒసి అభ్యర్థి ఉంటారని, మరో చోట ఓసి అభ్యర్థి ఉంటే అక్కడ బిసి అభ్యర్థి ఉంటారని దీంతో బిసిలకు న్యాయం జరగకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు ను మీరే ప్రతిపాదించారా? అని ప్రశ్నించగా, ‘ఇం డి’ కూటమి ప్రకటించిందని ఆయన చెప్పారు. నేనే ప్రకటించానని చెప్పడానికి ఎందుకు వెనుకాడుతున్నారు, అవును నేనే చెప్పాను అంటే ఆ క్రెడిట్ మీకే దక్కుతుంది కదా? అని మరో విలేకరి ప్రశ్నించగా, ‘నాకు క్రెడిట్ వద్దు, నాది డెబిట్ కార్డే..’ అంటూ చమత్కరించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగపరిరక్షుడు కాబట్టే ఇండి కూటమి ఎంపిక చేసిందన్నారు.

కెసిఆర్ అప్పాయింట్‌మెంట్ ఇస్తారా?
ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాల్సిందిగా తెలుగు రాష్ట్రాల పార్టీల నేతలను కోరిన మీరు వారిని ఏ విధంగా సంప్రదిస్తారని ప్రశ్నించగా, పార్టీ అధిష్టానం ఆదేశానుసారంగా నడుచుకుంటానని ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. తొలి విడతగా అన్ని పార్టీల నాయకులను కోరానని అన్నారు. బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలవాల్సి వస్తే….అని ప్రశ్నించగా, అసలు కెసిఆర్ తనకు అప్పాయింట్‌మెంట్ ఇస్తారా? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదురు ప్రశ్నించడంతో అందరూ నవ్వారు. ‘నా ముఖం చూడడానికి ఇష్టపడతారో లేదో..’ అని ముఖ్యమంత్రి అనడంతో అక్కడ నవ్వుల జల్లుకురిసింది. కుటుంబ సభ్యులకే అప్పాయింట్‌మెంట్ లభించదని, మీకు ఎలా లభిస్తుందని ఓ విలేకరి అనడంతో ముఖ్యమంత్రితో సహా అందరూ పెద్దగా నవ్వారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఈ నెల 21న నామినేషన్ దాఖలు చేయనున్నారని, ఈ కార్యక్రమానికి తాను పలువురు మంత్రులతో కలిసి వెళ్ళనున్నట్లు ఆయన చెప్పారు. ఆ తర్వాతే కార్యాచరణకు ‘ఇండి’ కూటమి సిద్ధపడుతుందని ఆయన తెలిపారు.

జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై..
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల గురించి ప్రశ్నించగా, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో మన రాష్ట్రానికే కాదు దేశ వ్యాప్తంగా అందరికీ ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. మీరే ప్రత్యామ్నాయ మార్గం ఆలోచన చేయాలన్నారు. కోర్టును మెప్పించేలా వెసులుబాటు కోసం ఆలోచన చేయాలని సీఎం విలేకరులకు సూచించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇస్తున్నామన్నారు. ఏది ఇచ్చినా శాంపిల్‌గా ఇవ్వం&పక్కగా ఇస్తామన్నారు. తన వద్ద ఏ ఫైలూ పెండింగ్‌లో ఉండదని, ఎంత రాత్రి అయినా యినా అంతా క్లియర్ చేశాకే ఇంట్లోకి వెళుతున్నానని అన్నారు. జర్నలిస్టులకు హెల్త్ ఇన్సురెన్స్ గురించి ఆలోచన చేయాలని, నిమ్స్ తప్ప మిగతా ఆసుపత్రుల్లో ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డు పని చేయడం లేదని విలేకరులు చెప్పగా, ముఖ్యమంత్రి స్పందిస్తూ ఈ విషయంలో వచ్చే నెల మొదటి వారంలో జర్నలిస్టుల ప్రతినిధుల బృందం తన వద్దకు వస్తే సంబంధిత అధికారులను పిలిపించి చర్చిద్దామని తెలిపారు. మీరు టీ తాగేలోపే పరిష్కారం చేసి, జివో చేతిలో పెడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News