- Advertisement -
అమరావతి: ఎపిలో అల్లర్లు చేసేందుకు వైసిపి కుట్రలు చేస్తోందని టిడిపి నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) తెలిపారు. సిఎం చంద్రబాబు నాయుడు కృషి వల్లే ఎపికి పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా బుద్దా మీడియాతో మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పెట్టుబడులు రావని తెలియజేశారు. వైసిపి సైకోలు కుట్రలు చేస్తున్నారని, మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డైరెక్షన్ లో(Jagan direction) సైకోలు నీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమ నాయకుడు అరగంట సమయం ఇస్తే మీ సంగతి తేలుస్తాం అని బుద్దా వెంకన్న హెచ్చరించారు.
- Advertisement -