- Advertisement -
హైదరాబాద్: నాన్ ట్యాక్స్ రెవెన్యూపై దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కేపిటల్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం భట్టి మాట్లాడుతూ.. గత పథకాలను ఒక్కటీ ఆపకుండా అమలు చేస్తున్నామని అన్నారు. కొత్తగా రూ.33,600 కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. గత ఏడాది ప్రభుత్వానికి ఒఆర్ఆర్, ఎక్సైజ్ ఆదాయాలు రాలేదని పేర్కొన్నారు. బడ్జెట్ నిధులు కొన్ని శాఖలకు ఎక్కువ, కొన్ని శాఖలకు తక్కువ అందాయన్నారు. బడ్జెట్ నిధులను అన్ని శాఖలు, విభాగాలకు సమానంగా పంచాలని సూచించారు.
- Advertisement -