మేషం – ఆర్థిక విషయ వ్యవహారాలు పరిష్కరించుకోవడం కష్టతరంగా మారుతుంది. నూతన ఒప్పందాలు లాభిస్తాయి. దైవానుగ్రహం రక్షిస్తున్నట్లుగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి.
వృషభం – సహనాన్ని ఓర్పును కనపరుస్తారు. ఆర్థిక అభివృద్ధి కొరకు అనేక విధాలుగా శ్రమిస్తారు. వృత్తి- వ్యాపారాల పరంగా సాధారణ ఫలితాలు అందుకుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి.
మిథునం – మీకు మేలు జరిగే పత్రాలు ఫైల్స్ మొదలైనవి ఆలస్యంగా అధికారుల పరిశీలనకు చేరతాయి. వృధా అయిన సమయాన్ని సాంకేతికంగా మీకు అనుకూలంగా మలుచుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
కర్కాటకం – మీకు ఊరట కలిగించే విధంగా మీ మీద వచ్చిన ఆరోపణలు నిందలు కల్పితలేనని తేలిపోతుంది. స్వప్రయోజనాల కొరకు అభివృద్ధి కొరకు మీ పరపతిని ఉపయోగించవలసి వస్తుంది.
సింహం – వివాదాలు పరిష్కరించుకోవడానికి మధ్యవర్తులను ఆశ్రయిస్తారు. ప్రపంచాన్ని ఇప్పుడు మీరు చూసే కోణంలో కాకుండా కొత్త కోణంలో చూస్తారు. నిజమైన మిత్రులు ఎవరో తెలుసుకోగలుగుతారు.
కన్య – అవసరాలకు సరిపడదనాన్ని సమకూర్చుకోగలుగుతారు. పరిస్థితుల ప్రభావం వలన ఒకరికి ఇచ్చిన మాటను నిలుపుకోలేకపోతారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దైవ చింతన కలిగి ఉంటారు.
తుల – ఆత్మీయులకు కీలక సమయంలో ఆర్థిక సహాయాన్నిఅందిస్తారు. వాస్తవికత దృష్టితో విషయాలను పరిశీలించి అర్థం చేసుకుంటారు. స్థిరాస్తుల వ్యవహారాలు కొనుగోలు అమ్మకాలు అనుకూల వాతావరణంలో ఉంటాయి.
వృశ్చికం – వ్యవహారాలను కొంతవరకు సానుకూల పరచుకోగలుగుతారు.చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.ఉద్యోగాలపరంగా అనుకూలమైన బదిలీ లేక ఉన్నతి లభించే సూచనలుఉన్నాయి.
ధనుస్సు – మిత్ర వర్గం, ఆత్మీయ వర్గం అన్ని విధాల సహకరిస్తారు. ఉన్నతస్థాయి వర్గం వారి అండదండలు లభిస్తాయి. శుభప్రదమైన ప్రసంగాలు చర్చలు మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి.
మకరం – ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.ప్రతి విషయము మొదట కొంత నింపాదిగా సాగినప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. మొండిబాకిలు కొంతమేర వసూలు అవుతాయి.తనఖా వస్తువులను విడిపిస్తారు.
కుంభం – కార్యాలయంలో పని భారం అధికంగా ఉంటుంది. వ్యాపార ఉన్నతికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో నిష్ణాతుల సలహాలను సూచనలను పరిగణలోనికి తీసుకోవడం చెప్పదగినది.
మీనం – పోటీ ప్రపంచంలో విజయాన్ని సాధించడానికి గాను అధికంగా శ్రమిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ సంతృప్తి చెందరు. దేవాలయ సందర్శనం చేసుకుంటారు. విదేశీయాన యత్నాలు కలిసి వస్తాయి.