Wednesday, May 21, 2025

బుధవారం రాశి ఫలాలు (21-05-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి.

వృషభం – దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల ఆనందం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.పెట్టుబడులకు తగిన సమయం. క్రయవిక్రయాలలో లాభాలు.

మిథునం – ఆదాయం కంటే ఖర్చులు అధికంగా వుంటాయి. కుటుంబ సమస్యల నుండి సహాయసహకారాలు అందుతాయి. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

కర్కాటకం – ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా వుండండి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును.

సింహం – నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తు, వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

కన్య – బంధువుల నుండి వచ్చిన వార్త ఆశ్చర్యపరుస్తుంది. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార మవుతాయి. అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి.

తుల – శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ముఖ్యమైన నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సంతానం చేయు నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి.

వృశ్చికం – బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలుగుతాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు.

ధనుస్సు – చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. కొత్త మిత్రులు పరిచయుఎ సాయం అందిస్తారు. సంతానం నుండి కీలక సమాచారం అందుకొంటారు.

మకరం – వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన వస్తు, వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు.

కుంభం – కుటుంబంలో ఎదురైన చికాకులు తొలుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుంటుంది. రుణాలు తీరి ఊరట చెందుతారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. సోదరుల నుండి శుభ ఆహ్వానాలు.

మీనం – ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆస్తి వివాదాలు తీరి వివాదాలకు దూరంగా వుండండి. ఆరోగ్యం, వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News