అసోంలో చేపడుతున్న తొలగింపు చర్యలు నైతికంగా సమర్థనీయం కాదు. చట్టపరంగా కూడా సమర్థించలేం. తగిన నోటీసు ఇచ్చి, సరైన విచారణలు, పునరావాసం లేకుండా ఎలాంటి తొలగింపులు చేపట్టలేమని సుప్రీంకోర్టు గతంలో పదేపదే పేర్కొంది. 1985లో ఓల్గా టెల్లిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ కేసులో రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే ప్రాథమిక హక్కులో భాగమే, జీవనోపాధి హక్కు అని కోర్టు స్పష్టం చేసింది. 2006 అటవీ హక్కుల చట్టం ఏళ్లుగా అడవులలో నివసించేవారి హక్కులకు స్పష్టంగా రక్షణ కల్పిస్తుంది. వారి సమస్యలు పరిష్కరించేవర కూ ఎలాంటి తొలగింపులు జరగరాదని ఆదేశిస్తుం ది. అసోం సర్కార్ మాత్రం క్రమబద్ధీకరణకు బదులు బుల్డోజర్లు, సాయుధ పోలీసుల సాయంతో ఖాళీ చేయించే మార్గాన్నే ఎన్నుకుంది.
అసోంలో కొనసాగుతున్న తొలగింపు కార్యక్రమాలు పాలనాపరమైన, అభివృద్ధిని కాకుండా, రాజకీయ, వలసరాజ్యాల నాటి భూవిధానాలను గుర్తుచేస్తున్నాయి. ఇది ఆందోళనకరం. ఈ మధ్య గోల్పారా, ధుబ్రీ, దరంగ్, ఇతర జిల్లాలలో జరిగిన కూల్చివేతలు కేవలం భూపునరుద్ధరణకు సంబంధించినవే కావు. ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ భూమి తిరిగి స్వాధీనం చేసుకోవడం అన్న ముసుగులో బలహీనవర్గాలను, ముఖ్యంగా బెంగాలీ మాట్లాడే ముస్లింలను లక్ష్యంగా చేసుకుని క్రమబద్ధంగా సాగిన దారుణాలు. దయ, కనికరం లేకుండా క్రూరంగా తొలగింపులు సాగాయి.
ఎటువంటి నోటీసులు లేకుండా ఇళ్లు, స్కూళ్లు, మసీదులు, నివాసాలను కూల్చేయడం ద్వారా రాజ్యాంగ హక్కులు, మానవతా సూత్రాలను బేఖాతర్ చేశారు. అంతర్జాతీయ చట్టాలపట్ల భారతదేశ బాధ్యతను కూడా తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు. మరీ దారుణం ఏమిటంటే, ఒక మతపరమైన సమర్థన. మొత్తం జనాభాను అక్రమ ఆక్రమణదారులు, బయట వ్యక్తులన్న సాకుతో కోతపెడుతున్నారు. ఇది దుష్టపాలనే కాదు, సంక్షేమ రాజ్యం అన్న సూత్రాన్ని దెబ్బతీసే ప్రమాదకరమైన రాజకీయ వ్యూహం.
జులై 12 17 తేదీల మధ్య గోల్పారాలోని పైకాన్ రిజర్వ్ ఫారెస్ట్‌లో 2,500 పైగా నిర్మాణాలు కూల్చివేయబడ్డాయి. 1,080 కుటుంబాలవారు నిర్వాసితులయ్యారు.- వీరిలో ఎక్కువ మంది దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న బెంగాలీ సంతతికి చెందిన ముస్లింలు. భారీ పోలీసు బందోబస్తుతో ఇళ్లు, మసీదుల కూల్చివేతసాగింది. నిర్వాసితులు ప్రతిఘటించినప్పుడు పోలీసులు కాల్పులకు తెగబడ్డారు.ఈ ఘర్షణలో ఒకవ్యక్తి చనిపోగా, పలువురు గాయపడ్డారు. అన్యులు ఆక్రమించిన అటవీభూమిని విడిపించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ ప్రభుత్వం ఈ చర్యలను సమర్థించుకుంది. ధుబ్రి జిల్లాలో అధికారులు, సౌర, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల సాకు చెప్పి, వాటి కోసం ఈనెలారంభంలో దాదాపు 1,400 కుటుంబాలను అంటే దాదాపు పది వేలమంది ప్రజలను ఖాళీ చేయించారు. ప్రతిపక్షాలు ముఖ్యంగా ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎఐయుడిఎఫ్)కు చెందిన ప్రతిపక్ష నాయకులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు భూమిని ఖాళీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకో, అభివృద్ధి కోసమో కాకుండా కేవలం కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం కలిగించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ తొలగింపు విధానాన్ని అనుసరిస్తోందనే అభిప్రాయం బలపడుతోంది. అలాగే, జూన్ నెలలో గోల్పారా జిల్లాలోని హసిలాబీల్ చిత్తడి నేలల్లోని 660కి పైగా కుటుంబాలను నిరాశ్రయులను చేశారు. జల్ జీవన్ మిషన్ కోసం ఇళ్లు, స్కూళ్లు, ప్రభుత్వం నిర్మించిన నీటి ట్యాంకులు, మౌలిక సదుపాయాలను బుల్డోజర్లతో కూల్చి
వేశారు.
తలదాచుకునే చోటు కరవైన ఆ కుటుంబాలకు పునరావాసం కల్పించలేదు. వారు ఇప్పుడు దుర్భర పరిస్థితుల్లో తాత్కాలికంగా వేసుకున్న గుడిసెల్లో నివసిస్తున్నారు. దరంగ్‌లోని సిపజార్ -ధల్పూర్ ప్రాంతంలో బహిష్కరణలతో తీవ్ర విషాదం నెలకొంది. ప్రభుత్వం చేపట్టిన డ్రైవ్ 2021లో ఇద్దరు పౌరులను కాల్చి చంపడంతో విమర్శల పాలైంది. ప్రభుత్వం అపఖ్యాతి పాలైంది. 2024 మేలో మరో ఆపరేషన్ జరిగింది. ఫలితంగా మరో 400 కుటుంబాలకు గూడు లేకుండా పోయింది. పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీలు గాలికి పోయాయి. నల్బరి, హహిలాభిల్, అశుధుబి వంటి జిల్లాలలో కూడా స్థానం భ్రంశం కథలు వెలుగులోకి వచ్చాయి. 2023- 2025 మధ్య గోల్పారా, ధుబ్రీ, నల్పరీ జిల్లాలలో 8 వేలకు పైగా కుటుంబాలు నిర్వాసితులయ్యారని మానవహక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. కొన్ని వర్గాలను లక్ష్యాలను చేసుకుని ఈ తొలగింపులను చేపట్టినట్లు భావిస్తున్నారు. ప్రభుత్వం ఈ కార్యకలాపాలను ఆక్రమణదారులను తొలగించే డ్రైవ్‌గా కలర్ ఇస్తున్నప్పటికీ, నిలువనీడ కోల్పోయిన జనం కథనాలు వేరేగా ఉన్నాయి. వీరిలో అత్యధికులు బెంగాలీ మాట్లాడే ముస్లింలు. వీరిలో చాలామందికి భూరికార్డులు ఉన్నాయి. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. కానీ ఇతర వర్గాలనుంచి, ముఖ్యంగా హిందువుల నుంచి దశాబ్దాలుగా స్థిరపడినవారిని ఎక్కువగా తప్పించారు.
ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ నివాసులను అక్రమ ఆక్రమణదారులు అనీ, బయట వ్యక్తులు అని పదేపదే అంటారు. ఈ భాష బిజెపి దీర్ఘకాలిక జనాభా మార్పు కథనాలు, లేదా మియా ముస్లిం ముప్పు అనే పిలుపును ప్రతిధ్వనిస్తుంది. ఇది మైనారిటీలను భూమి, వనరులు ఆక్రమించుకునేవారిగా చిత్రీకరించడం ద్వారా హిందూ ఓటు బ్యాంక్‌ను ఏకం చేయడానికి ఉద్దేశపూర్వకంగా సాగుతున్న రాజకీయ వ్యూహంలో భాగం. ఇక, బుల్డోజర్లను ఉపయోగించడం అనేది బిజెపి రాష్ట్రాలలో కనిపించే వ్యూహాలకు అద్దంపడుతుంది.అక్కడ కూల్చివేత డ్రైవ్‌లు తరచుగా మతపరమైన లోపాలను సరిదిద్దేందుకు బలమైన పాలన ఉన్నట్లు ప్రదర్శించడానికే చేపడుతున్నారు. అంతేకాక వలసవాద విధానాలకు సమాంతరంగా నడుస్తున్నట్లు స్పష్టమవుతోంది. బ్రిటీష్ హయాంలో ఆదివాసీలు, అడవులలోని తెగలను, వారి భూమిని స్వాధీనం చేసుకోవడానికి వారిని నేరస్థులుగా ముద్రవేసి, ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో సాంప్రదాయ అటవీ నివాసులను, పేదలను నేరస్థులుగా ముద్రవేస్తోంది. అసోంలో చేపడుతున్న తొలగింపు చర్యలు నైతికంగా సమర్థనీయం కాదు.
చట్టపరంగా కూడా సమర్థించలేం. తగిన నోటీసు ఇచ్చి, సరైన విచారణలు, పునరావాసం లేకుండా ఎలాంటి తొలగింపులు చేపట్టలేమని సుప్రీంకోర్టు గతంలో పదేపదే పేర్కొంది. 1985లో ఓల్గా టెల్లిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ కేసులో రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే ప్రాథమిక హక్కులో భాగమే, జీవనోపాధి హక్కు అని కోర్టు స్పష్టం చేసింది. 2006 అటవీ హక్కుల చట్టం ఏళ్లుగా అడవులలో నివసించేవారి హక్కులకు స్పష్టంగా రక్షణ కల్పిస్తుంది. వారి సమస్యలు పరిష్కరించేవరకూ ఎలాంటి తొలగింపులు జరగరాదని ఆదేశిస్తుంది.
అసోం సర్కార్ మాత్రం క్రమబద్ధీకరణకు బదులు బుల్డోజర్లు, సాయుధ పోలీసుల సాయంతో ఖాళీ చేయించే మార్గాన్నే ఎన్నుకుంది. భారతదేశం అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక, సాంసృ్కతిక హక్కుల ఒప్పందానికి (ఐసిఇఎస్‌సిఆర్)కు కట్టుబడి ఉంది. ఐక్యరాజ్యసమితి ప్రాథమిక సూత్రాలు, మార్గదర్శకాలు కూడా గృహ నిర్మాణ హక్కు, బలవంతపు తొలగింపులనుంచి రక్షణకు హామీ ఇస్తుంది. అలాంటివి మానవ హక్కుల తిరస్కరణకు దారితీయరాదని స్పష్టం చేస్తుంది. అసోంలో బహిష్కరణలు ఈ సూత్రాలను ఉల్లంఘిస్తూ సాగుతున్నాయి. పలితంగా వేలాదిమంది ఆశ్రయం కోల్పోతున్నారు. ఆహారం, స్వచ్ఛమైన నీరు, వైద్య సౌకర్యాలు లేకుండా పోతున్నాయి. నిరసన కారులపై కాల్పులు, హెచ్చుమీరిన బలప్రయోగం, పోలీసులు, సైనిక బలగాలతో బలప్రయోగం ద్వారా ప్రభుత్వం అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తున్నది. గోల్పారాలో సామాన్యులపై పోలీసుల కాల్పులు, బెదిరింపులు, అణచివేసేందుకు ఎలా ప్రయత్నించారో స్పష్టం చేస్తున్నాయి.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం లక్ష్యం ప్రజాసంక్షేమమే. ప్రభుత్వం పౌరులకు ముఖ్యంగా బడుగు బలహీనవ ర్గాలకు గృహ నిర్మాణం,ఆరోగ్య సంరక్షణ, భద్రత కల్పించాలని భావిస్తారు. అందుకు విరుద్ధంగా అసోం ప్రభుత్వం బహిష్కరణ విధానానికి పెద్దపీట వేస్తోంది. రాష్ట్రంలో పేదలను కార్పొరేట్ ప్రాజెక్టులు, ఎన్నికల వ్యూహాలకు అడ్డంకులుగా పరిగణిస్తోంది. ప్రభుత్వం మానవతా దృక్పథంతో, చట్టబద్ధమైన విధానాన్ని అనుసరించి చాలా కాలంగా రాష్ట్రంలో ఉన్న వారి హక్కులు గుర్తించడం, భూముల క్రమబద్ధీకరణ, ప్రత్యామ్నాయ గృహకల్పన, పరిహారం చెల్లింపు చేయవలసి ఉంది. అందుకు బదులుగా మతపరమైన, జాతీయవాదం పేరుతో కూల్చివేతల మార్గాన్ని ఎంచుకుంది. సామాజిక స్పర్ధలను పెంచి, ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసింది. ఈ తొలగింపులు జరుగుతున్న తీరు ప్రభుత్వం జవాబుదారీని కోరుతున్నది.
ప్రభుత్వం రాజ్యాంగపరమైన, చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించిందా అన్నఅంశంపై జాతీయ మానవహక్కుల సంస్థలు దర్యాప్తు చేయాలి. పునరావాసం కల్పనకు, తొలగింపులను అడ్డుకునేందుకు పౌరసమాజం, రాజకీయ ప్రతిపక్షాలు ఒత్తిడి పెంచాలి. అదే సమయంలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యుమన్ రైట్స్ వాచ్ వంటి సంస్థలు జోక్యం చేసుకుని మానవ హక్కుల ఉల్లంఘనను రికార్డ్ చేయాలి, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ కూడా భారతదేశానికి అంతర్జాతీయ బాధ్యతలను గుర్తుచేయాలి. అసోం ప్రభుత్వం తక్షణం తొలగింపు కార్యక్రమాలను నిలిపివేయాలి. పునరావాసం, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టాలి. అటవీ హక్కుల చట్టాన్ని గౌరవించాలి.
సాధ్యమైనంత మేరకు దీర్ఘకాలిక నివాసుల స్థావరాలను క్రమబద్ధీకరించాలి. అన్నింటికన్నా ముఖ్యంగా తమ మతపరమైన విభజన విధానాన్ని విడిచి పెట్టి, మెజారిటీ రాజకీయాలనుంచి వైదొలగి, సామాజిక న్యాయం కోసం కృషిచేయాలి. సంక్షేమ రాజ్యం గొప్పతనం కార్పొరేట్ సంస్థల కోసం సేకరించే హెక్టార్ల భూమిలో కాదు. రాష్ట్రంలోని పేద, బలహీన వర్గాల ప్రజల సంక్షేమంలో ప్రతిబింబిస్తుంది. అసోం ప్రస్తుత మార్గంలోనే కొనసాగితే, అది అశాంతినే మిగులుస్తుంది. అంతర్జాతీయంగా కూడా విమర్శల పాలయ్యే అవకాశం ఉంది. బుల్డోజర్లు నిలిచి, వాటి స్థానే కరుణ, మానవతా దృక్పథం. చట్టబద్ధత పవిఢవిల్లాలి.
గీతార్థ పాఠక్
ఈశాన్యోపనిషత్