Thursday, August 14, 2025

రెండో టెస్టుకు బుమ్రా దూరం?

- Advertisement -
- Advertisement -

బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరిగే రెండో టెస్టులో టీమిండియా స్టార్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా బరిలోకి దిగడం సందేహంగా మారింది. ఫిట్‌నెస్ లేమీతో బాధపడుతున్న బుమ్రా ఈ మ్యాచ్‌లో ఆడడం కష్టంగా కనిపిస్తోంది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బుమ్రా 43.3 ఓవర్ల పాటు బౌలింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లను పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లు బౌలింగ్ చేసినా వికెట్లను మాత్రం పడగొట్ట లేక పోయాడు. తొలి టెస్టులో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేసిన ప్రస్తుతం అలసిపోయినట్టుగా కనిపిస్తున్నాడు. ఇదే జరిగితే అతన్ని రెండో టెస్టులో ఆడించే సాహసం జట్టు మేనేజ్‌మెంట్ చేయక పోవచ్చు. ఇక రెండో టెస్టులో బుమ్రా ఆడడం సందేహమేనని జాతీయ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News