- Advertisement -
రాంఛీ: ఝార్ఘండ్ రాష్ట్రం దియోగఢ్ లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోహన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జామునియా గ్రామ శివారులోని గొడ్డ దియోగఢ్ ప్రధాన రహదారిపై బస్సు లారీని ఢీకొని 18 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. దేవఘర్‌లోని బాబా బైద్యనాథ్‌ను కన్వారియాలు సందర్శించడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -