- Advertisement -
హైదరాబాద్: వికారాబాద్ జిల్లా పరిగి గ్రామంలో బస్టాండ్ ముందు మద్యం దుకాణంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మద్యం దుకాణంలో మందుబాబు అపస్మారక స్థితిలో పడిపోవడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మందుబాబు చనిపోయాడని వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు బొమ్రాస్ పేట మండలం రేగడి మైలారానికి చెందిన మొగులయ్య (36)గా గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -