Sunday, September 14, 2025

ఉపపోరు తప్పదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/గద్వాలప్రతినిధి : రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జోస్యం చెప్పారు. శనివారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన భా రీ బహిరంగ సభలో గద్వాల మాజీ మున్సిపల్ చై ర్మన్ బిఎస్ కేశవ్‌తో పాటు పది మంది మాజీ కౌ న్సిలర్లు, నియోజకవర్గంలోని మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, మాజీ జడ్‌పిటిసిలు పెద్ద సం ఖ్యలో బిఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సం దర్భంగా కెటిఆర్ మున్సిపల్ మాజీ ఛైర్మన్ బిఎస్ కేశవ్, మాజీ జడ్‌పిటిసి పద్మ వెంకటేవ్వర్ రెడ్డిలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంత రం ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ ..బిఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి, గెలిచి, పార్టీ మారిన ఆ పది మంది ఎంఎల్‌ఎల భరతం పట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.సిఎం రేవంత్‌రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటేవారి దగ్గర రాజీనామా చేయించాలని సవా ల్ చేశారు. గద్వాల ఎంఎల్‌ఎ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎంపి

ఎన్నికల సమయంలో తనను కాంగ్రెస్ లో చేరమని ఒత్తిడి చేస్తున్నారని, కానీ రైలు కింద తలకాయ పెట్టి చనిపోతానే తప్ప ఆ పార్టీలో చేరే ముచ్చట లేదని చెప్పి.. ఇప్పుడు రేవంత్ రెడ్డి సం కన ఎక్కి సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడని మం డిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలే, రూ.4000 పెన్షన్ ఇవ్వలే, ఆడ బిడ్డలకు రూ.2,500 ఇవ్వలే, షాదీముబారక్, కళ్యాణలక్ష్మికి తులం బంగారు ఇవ్వలే, రూ.2 లక్షల రుణమాఫీ చేయలే, రోడ్లు బాగుపడలే మరి ఏ అభివృద్ది చూసి కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారిండో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ నాయకత్వంలో కృష్ణమోహన్ రెడ్డి నమ్మి గద్వాల ఎంఎల్‌ఎగా గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు పంగనామాలు శఠగోపం పెట్టాడని మండిపడ్డారు. ఏదేమైనా రాష్ట్రంలో ఉప ఎన్నికలు 6 నుండి 9 నెలల్లో రావడం ఖాయమని, చిత్తు చిత్తుగా వారిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రానికి అప్పు లేదో… ఏ మనిషికి అప్పు లేదు అన్నట్లు తెలంగాణ రాష్ట్రానికి అప్పులు పెరిగిపోయాయని రాష్ట్ర మర్యాదను తీస్తున్నార మండిపడ్డారు.

Also Read:ఇద్దరు విద్యార్థులకు విద్యుత్ షాక్

బిఆర్‌ఎస్ హయాంలోనే అభివృద్ధి

పదేండ్ల బిఆర్‌ఎస్ హయాంలోనే గద్వాల నియోజకవర్గం అభివృద్ది జరిగిందన్నారు. మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, 1,275 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రెండు ఎత్తిపోతల పథకాలు ఇలా ఎన్నో పథకాలు చేసి నడిగడ్డను అభివృద్ధి చేశామని అన్నారు. గతంలోనే తుమ్మిళ్ల లిప్టును కంప్లీట్ చేశామని అన్నారు. గట్టు లిప్టును 40% పనులు కంప్లీట్ చేయగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పండబెట్టిందని మండిపడ్డారు. రోడ్లు బాగా లేవని, అభివృద్ధ్ది నిలిచిపోయిందని ,ఇక్కడి నుంచి మళ్లీ వలసలు వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. గతంలో రివర్స్ మైగ్రేషన్ గద్వాలలో ఉండేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. 22 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏం అభివృద్ది చేశారని ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

యూరియాను, ఉద్యోగాలను అమ్ముకుంటుండ్రు :
ఒకవైపు కాంగ్రెస్ దొంగలు యూరియాను అమ్ముకుంటున్నారని, మరొకవైపు గ్రూప్ వన్ ఉద్యోగాలను మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు ఒక్కొక్క పోస్టులు అమ్ముకొని ఇప్పటికి రూ.1,700 కోట్లు దండుకున్నారని ఆరోపించారు. 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి రెండున్నరేళ్లయినా ఎస్‌సి, ఎస్‌టి, బిసి డిక్లరేషన్లను ప్రకటించిన ఇప్పటికీ అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు.

ఆరు గ్యారంటీలతో అరచేతిలో స్వర్గం చూపించారు :
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించేందుకు కాంగ్రెస్ నోటికి వచ్చిన హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలో అరచేతిలో స్వర్గం చూపించిందని విమర్శించారు. హామీలు నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్‌ను రాబోయే రోజుల్లో అన్ని ఎన్నికల్లో బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలలో గులాబీ జెండాలు రెపరెపలాడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లకా్ష్మరెడ్డి, ఎంఎల్‌ఎసిలు చల్లా వెంకట్రామి రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డి, అలంపూర్ ఎంఎల్‌ఎ విజయుడు, మాజీ ఎంఎల్‌ఎలు రాజేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News