- Advertisement -
మహబూబ్ నగర్: జడ్చర్ల బైపాస్ రోడ్డు గురించి కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, ఎంపి డికె అరుణ కలిశారు. ఎంపి డికె అరుణతో కలిసి జడ్చర్ల బైపాస్ రోడ్డు ఆవశ్యకతను కేంద్ర మంత్రికి ఎమ్మెల్యేలు, ఎంపి వివరించారు. జడ్చర్ల బై పాస్ రోడ్డు మంజూరు చేస్తామని, దీనికి సంబంధించిన డిపిఆర్ ను స్టడీ చేసిన అనంతరం బడ్జెట్ లో రోడ్డుకు నిధులు కేటాయిస్తామని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
- Advertisement -