కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌కు గొప్ప వరమిచ్చింది. సెమికండక్టర్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. యుపిలోని జెవార్‌లో రూ 3,706 కోట్ల రూపాయల వ్యయంతో తలపెట్టిన హెచ్‌సిఎల్ ఫ్యాక్స్‌కాన్ డిస్‌ప్లే చిప్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతిని ఇచ్చింది. కేంద్ర మంత్రి మండలి బుధవారం నాటి సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఈ కర్మాగారం సంయుక్త రంగ ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటుంది. మొలైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఆటోమొబైల్స్‌కు వాడే డిస్‌ప్లే డ్రైవర్ చిప్‌ను ఈ కర్మాగారంలో ఉత్పత్తి చేస్తారు. దీని వల్ల స్థానిక యువతకు, సాంకేతిక ప్రతిభకు సరైన ఉపాధి ఉద్యోగావకాశాలు దక్కుతాయి. కేబినెట్ వివరాలను ఆ తరువాత కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులకు తెలిపారు. ఈ ఫ్యాక్టరీలోమప్రతినెలా 20000కు పైగా వ్రాఫర్స్ నిర్వహణకు వీలుంటుంది. ఇక నెలకు 3.6 కోట్ల మేర చిప్స్ తయారీ సామర్థం సంతరించుకుని ఉంటుంది.
ఇది దేశంలో ఆరవ సెమి కండక్టర్ ప్లాంట్ అని మంత్రి వివరించారు. అత్యంత అధునాతన సాంకేతికత ఈ ప్లాంట్ ప్రత్యేకత. ప్రామాణిక నాణ్యమైన రీతిలో సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, లాప్‌టాప్‌లలో సరైన రీతిలో స్పష్టంగా కాంటెంట్ కనబడటానికి వీలుంటుంది. దీని వల్ల సదరు వస్తువులకు గిరాకీ కూడా పెరుగుతందని మంత్రి చెప్పారు. ఫ్యాక్స్‌కాన్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో మంచి పేరుంది. అతి పెద్ద తయారీ సంస్థగా ఉంటూ ఇప్పటికే యాపిల్ ఐ ఫోన్లను కూడా సిద్ధం చేస్తోంది. ఇక్కడ ఈ ఫ్యాక్టరీ నెలకొనడం జరిగితే డిస్‌పే ప్యానెల్ పాంట్ పూర్తి స్థాయిలో భారత్‌కు తరలివచ్చినట్లే అవుతుంది. ఇక్కడి ఉత్పత్తి 2027 నాటికి ఆరంభమవుతుంది. దాదాపు రెండు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది.