హైదరాబాద్: ఇవాళ సభలో పెట్టిన బిసి బిల్లుకూ సంపూర్ణ మద్దతిస్తున్నామని బిజెపి ఎంఎల్‌ఎ పాయల్ శంకర్ తెలిపారు. తెలంగాణలో బిసిలకున్న అనుమానాలకు ప్రభుత్వం నివృతి చెయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పురపాలక చట్టం 2019 నిబంధనలపై చర్చించడం జరిగింది. పురపాలక, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టిన సందర్భంగా పాయల్ శాసన సభలో మాట్లాడారు. కాంగ్రెస్ కామారెడ్డి బిసి డిక్లరేషన్‌పై సభలో చర్చ జరగాలని, తెలంగాణలో కాంగ్రెస్ ఏర్పడి 22 నెలలైందని, కామారెడ్డి డిక్లరేషన్ తరువాత బిసిలంతా ఆశపడ్డారని, మంత్రివర్గంలో బిసి సంఖ్య ఎంత? అని చురకలంటించారు. బిసిల్లో సమర్థులు లేరా? ప్రభుత్వం గుండెపై చేయివేసుకొని చెప్పాలని నిలదీశారు.
Also Read: తీర్పులపై వక్రభాష్యాలు.. ఇదేం తీరు?
మంత్రివర్గం, కార్పొరేషన్లలో బిసిల సంఖ్య ఎంత? అని అడిగారు. సంవత్సరానికి రూ.20 వేల కోట్లు బిసిలకు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని, ప్రభుత్వం ఏర్పడి రెండు 22 నెలలు అవుతుందని, ఆ లెక్కన రూ.40 వేల కోట్లు బిసిలకు ఇవ్వాలని పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. చట్టాలు చేసేముంప న్యాయస్థానాల వైపు కూడా చూడాలని, ఎలాంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితి లేకుండా చట్టాలు చేయాలని, ఎక్కడా ఆటంకాలు కలగకుండా బిసిలకు లబ్ధి కలగాలన్నారు. షెడ్యూల్ 9లో జోడించిన అంశంపైనా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని, షెడ్యూల్ 9లో చేర్చినా సమీక్షలు జరుపుతామని కోర్టు చెప్పిన విషయాలన్ని పాయల్ శంకర్ గుర్తు చేశారు.