Friday, August 1, 2025

సహకార సంఘాలకు రూ 2 వేల కోట్లు

- Advertisement -
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన(పిఎంకెఎస్‌వై) బడ్జెట్ కేటాయింపులను రూ 1920 కోట్ల మేర పెంచింది. దీనితో ఇప్పుడీ పథకానికి కేటాయింపుల మొత్తం రూ 6520 కోట్లు అవుతుంది. కేటాయింపుల పెంపుదల నిర్ణయానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. గురువారం ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఆర్థిక వ్యవహారాల కమిటీ నిర్ణయానికి అనుగుణంగా పిఎంకెఎస్‌ఎఫ్ నిధులను పెంచారు. ఈ విషయాన్ని సమాచార ప్రసారాల మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులకు తెలిపారు. కేంద్ర కేబినెట్ ఈ రోజు సమావేశంలో రైల్వే ప్రాజెక్టుల పనులకు కూడా ఆమోదం తెలిపింది.

6 రాష్ట్రాలలోని 13 జిల్లాలలో నాలుగు బహుళ లైన్ల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి వైష్ణవ్ చెప్పారు. ఈ ప్రాజెక్టులపనుల విలువ దాదాపుగా రూ 11,169 కోట్ల వరకూ ఉంటుంది.మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ , ఒడిషా, జార్ఖండ్‌ల్లో ఈ ప్రాజెక్టుల ఆమోదం పరిధిలో దాదాపుగా 574 కిలోమీటర్ల దూరం వరకూ నాలుగు లేన్ల ట్రాక్‌లు ఏర్పడుతాయి. . జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సిడిసి)కి రూ 2 వేల కోట్ల ఆర్థిక సాయం అందించే నిర్ణయానికి కూడా ఆమోదం తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 8 లక్షలకు పైగా సహకార సంఘాలకు చెందిన 29 కోట్ల మందికి ఈ సంస్థ ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర సాయం ఉపయోగపడుతుందని మంత్రి మీడియాకు తెలిపారు. ఈ సంఘాలలో అత్యధికులు రైతులే ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News