Sunday, September 14, 2025

సచివాలయంపై కెసిఆర్‌కు ఈటల చురక!

- Advertisement -
- Advertisement -
ఇప్పటికైనా వస్తారని భావిస్తున్నా!!

హుజురాబాద్: తొమ్మిదేళ్లుగా సచివాలయానికి రాని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇకనైనా కొత్త సచివాలయానికి వస్తారని భావిస్తున్నట్లు బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్ అన్నారు. పాత సచివాలయంలో ఉమ్మడి రాష్ట్రానికి చెందిన ఆనవాళ్లు ఉండేవన్నారు. ఆ ఆనవాళ్లు ఉండకూడదనే కెసిఆర్ కొత్త సచివాలయాన్ని నిర్మించారని విమర్శించారు. ఆయన హుజురాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు.

కొత్త సచివాలయం కట్టడాన్ని తాను వ్యతిరేకించడంలేదని, కాకపోతే ఆయన తన ప్రతిష్ట కోసం, పేరు కోసం దీనిని కట్టినట్లు భావిస్తున్నానన్నారు. గతంలో ఎప్పుడూ సచివాలయానికి లేదా ఆఫీసుకు రాని ముఖ్యమంత్రి, కనీసం ఇప్పుడైనా కొత్త సచివాలయానికి వస్తారని, సచివాలయానికి వచ్చి ప్రజలను కలుస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News