- Advertisement -
అమరావతి: ఎపి రాజధాని అమరావతి ప్రపంచంలోనే కీలక పాత్ర పోషిస్తుందని ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. దుర్గమ్మ ఆశీస్సులు తీసుకుని వెలగపూడి సభకు అమరావతి నిర్మాణ పనుల పున:ప్రారంభానికి సైకిల్ పై కలిశెట్టి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎఐ సాంకేతిక పరిజ్ఞానంలో రాష్ట్రం ముందుండబోతుందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో శాశ్వతంగా రాజధానిగా ఉంటుందని, అమరావతి రైతుల ఆకాంక్షలు నెరవేరబోతున్నాయని కలిశెట్టి అప్పలనాయుడు ప్రశంసించారు.
- Advertisement -