Tuesday, September 16, 2025

ఒకే కుటుంబానికి చెందిన 10 మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమా దం జరిగింది. ప్రైవేటు బస్సు ఇన్నోవా కారును ఢీకొట్టిన ఘటనలో పది మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉ న్నారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెంది న వారు. ప్రమాదంలో మరికొంతమంది తీవ్రం గా గాయపడ్డారు. మైసూరు జిల్లాలోని కొల్లేగల – టీనర్సిపుర ప్రధాన రహదారిపై కురుబురు గ్రా మ సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థ లానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు బళ్లారికి చెం దిన వారని, మలే మాదేశ్వరుని దర్శించుకుని మైసూరు నగరానికి వస్తున్నారని పోలీసులు తె లిపారు. ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమా ద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో మృతదేహాలు ఇరుక్కుపోయి తీవ్రంగా చితికిపోయినట్లు కనిపించాయి. మృతదేహాల ను, క్షతగాత్రులను బయటికి తీయడానికి తీ వ్రంగా శ్రమించామని, అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News