- Advertisement -
జనగాం: గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని భక్తులు తిరుపతికి వెళ్తుండగా కారు వాగులో పడిపోయింది. ఈ సంఘటన జనగామ జిల్లాలోని వడ్లకొండ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన యువకులు కారులో తిరుపతికి బయలుదేరారు. గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని జనగామ జిల్లా నుంచి వెళ్తున్నారు. వడ్లకొండ సమీపంలోకి రాగానే కారు వాగులో పడిపోవడంతో స్థానికులు వారిని కాపాడారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన స్థలంలో బ్రిడ్జి నిర్మాణం జరుగుతోందని, నిర్మాణ ప్రాంతంలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.
- Advertisement -