Sunday, September 7, 2025

పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన కారు.. యువతి మృతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః కారు అదుపు తప్పి పోలీస్ వాహనాన్ని ఢీకొట్టడంతో యువతి మృతిచెందిన సంఘటన లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…వినాయకుడి నిమజ్జనం సందర్భంగా లంగర్‌హౌస్ డిటెక్టివ్ ఇన్స్‌స్పెక్టర్ సత్యనారాయణ లంగర్‌హౌస్ దర్గా సమీపంలో ట్రాఫిక్‌ను క్లియర్ చేసే విధుల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది.

కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. ప్రమాదంలో కశ్వి(20) అనే యువతి అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాపడిన వారిని పోలీసులు వెంటనే ఆస్సత్రికి తరలించారు. పోలీస్ వాహనంలో ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సంఘటనపై లంగర్‌హౌస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News